VZM: నీటి సంరక్షణ, నిల్వ చేసే పనులకు ప్రణాళికలో ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలని డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్.శారద దేవి కోరారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై DRDA సమావేశ మందిరంలో మంగళవారం వర్క్ షాప్ నిర్వహించారు. 2026- 27 పనుల ప్రణాళిక, బడ్జెట్ కేటాయింపు, గుర్తింపు, పనుల నిర్వహణ తదితర అంశాలపై ఎస్క్యూసీవో శ్రీనివాసరావు శిక్షణ ఇచ్చారు.