VSP: ఎండాడ వైసీపీ కార్యాలయంలో రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉత్తరాంధ్ర యువజన విభాగం సమీక్ష సమావేశం జరిగింది. యువజన విభాగాన్ని బలోపేతం చేసి గ్రామ, మండల కమిటీలు త్వరగా పూర్తి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, జోనల్ నాయకులు మెంటాడ స్వరూప్ పాల్గొన్నారు.