HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావు పాల్గొంటున్నారు. రహదారి పక్కన ఉన్న ఓ టిఫిన్ సెంటర్లో రుచికరమైన అల్పాహారం ఆస్వాదించారు. స్థానిక ప్రాంత ప్రజలతో ఆప్యాయంగా మమేకమయ్యారు. బీజేపీకి మద్దతు ఇవ్వాలని, లంకల దీపక్ రెడ్డికి గెలిపించాలని కోరారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం బీజేపీతోనే సాధ్యమవుతుందని చెప్పారు.