జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో రైతులకు విత్తనాలను ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి పంపిణీ చేశారు. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో అమలు అవుతున్న జాతీయ ఆహార భద్రత, పోషణ మిషన్ (ప్యాడీ), జాతీయ నూనెగింజల మిషన్ (గ్రౌండ్నట్) కార్యక్రమాల కింద రైతులకు నాణ్యమైన విత్తనాలను సంబంధిత అధికారులు పంపిణీ చేశారు.