GNTR: గుంటూరు జిల్లాలో రైతులకు సాగు నీరు అంతరాయం లేకుండా అందేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం జలవనరుల శాఖ అధికారులతో ఆమె నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. కాలువల పూడికతీత, మరమ్మత్తు పనులను వేగవంతం చేసి సాగు సీజన్‌కు ముందు పూర్తి చేయాలని సూచించారు.