ADB: శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు టూటౌన్ CI నాగరాజు మంగళవారం తెలిపారు. పట్టణంలోని బొక్కల్గూడకు చెందిన అబ్దుల్ రషీద్ పోలీసులు ఓ వ్యక్తిని కొట్టినట్లు ఉన్న పాత వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.