MLG: ఏటూరునాగారం మండలం కేంద్రంలోని పలు గ్రామాల్లో ఉపాధి కూలీల ఈ-కేవైసీ ప్రక్రియలో మొబైల్ సిగ్నల్ లేకపోవడంతో గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్లు స్థానిక వాటర్ ట్యాంక్, బిల్డింగులు ఎక్కుతున్నారు. సిగ్నల్ లేకపోవడం వల్ల ఈ-కేవైసీ ప్రక్రియ ఆలస్యమవుతుందని, ఉపాధి కూలీలు ఇబ్బంది పడుతున్నారని ఫీల్డ్ అసిస్టెంట్లు తెలిపారు. ఈ సమస్య పై అధికారులు స్పందించాలని ఇవాళ కోరారు.