BDK: పామాయిల్ సాగులో అంతర పంటగా మునగ సాగు చేపట్టాలని రైతులకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ సుచించారు. జిల్లాలో 500 చేపల పెంపక యూనిట్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ములకలపల్లి మండల పర్యటనలో తెలిపారు. పూసుగూడెంలో పంచాయతీ వర్కర్లు తయారు చేస్తున్న బయోచార్ తయారీ ప్రక్రియను పరిశీలించారు.