ASF: చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ. 15.40 లక్షల అంచనాతో మంజూరైన పొలంబాట రోడ్డు నిర్మాణానికి MLA హరీష్ బాబు మంగళవారం శంకుస్థాపన చేశారు.MLA మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా చేలకు, పొలాలకు గ్రావెల్ రోడ్లు వేస్తున్నామని,ప్రతి గ్రామంలో 2 కి.మీ తక్కువ కాకుండా రోడ్లు నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.