KMM: వైరా మండలం సిరిపురం ప్రభుత్వ పాఠశాలలోని 20 మంది 10వ తరగతి విద్యార్థులకు మంగళవారం ఒక్కొక్కరికి 500 చొప్పున రిటైర్డ్ అధ్యాపకులు సత్యనారాయణ ఆర్థిక సహాయం అందజేశారు. బీటెక్ చదువుతున్న పేద విద్యార్థినికి లాప్టాప్ను అందజేసి ఉన్నత స్థానానికి మంచి విద్య అభ్యసించి చేరుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.