GNTR: పెదకాకాని శివాలయంలో కార్తీక మాసం (అక్టోబరు 22 – నవంబరు 20) ఉత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయని ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు, మంచినీరు, వసతి, అన్నదానం వంటి ఏర్పాట్లు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆలయ పరిసరాలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.