ఏపీలో గూగుల్ పెట్టుబడులు పెట్టడంపై తమిళనాడులో రాజకీయ దుమారం రేగింది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తమిళ వ్యక్తి అయినప్పటికీ సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించడంలో డీఎంకే విఫలమైందని అన్నాడీఎంకే ఆరోపించింది. అయితే కేంద్రంలోని బీజేపీ సపోర్టుతో గూగుల్ ఏపీకి వెళ్లిందని డీఎంకే కౌంటర్ ఇచ్చింది. తమిళనాడులో కాకుండా ఏపీకి గూగుల్ ఏఐ హబ్ రావడంపై మీ కామెంట్?.