ADB: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో నిలవాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ గ్రామీణ మండలం బంగారుగూడలోని టీజీఎంఆర్ఎస్ జూనియర్ కాలేజ్‌ను సందర్శించి ఎక్సలెన్స్ సెంటర్ ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సాంకేతికతను సద్వినియోగం చేసుకొని ఐఐటీ, నీట్, ఇతర జాతీయ స్థాయి పరీక్షల్లో విజయం సాధించాలని కోరారు.