NTR: రెడ్డిగూడెం మండల కేంద్రంలోని పాక్స్ కార్యాలయంలో మంగళవారం గ్రామ రైతులకు ధాన్యం కొనుగోలు, పంట నమోదు కార్యక్రమాలపై తహశీల్దార్ సుశీల దేవి అవగాహన కల్పించారు. రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలన్నారు. 7337359375 నంబర్‌కు వాట్సాప్ మెసేజ్ చేసి ధాన్యం కొనుగోలు షెడ్యూల్ చేసుకోవచ్చని తెలిపారు. ధాన్యాన్ని 17 శాతం తేమ శాతానికి ఆరబెట్టాలని తహశీల్దార్ సుశీల దేవి సూచించారు.