ELR: జంగారెడ్డిగూడెం బాబు జగజీవన్ రావు విగ్రహం వద్ద మంగళవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. భారతదేశ వ్యవసాయ రంగాన్ని దివాళ తీసే విధానాలు అవలంబిస్తున్న అమెరికాను కేంద్ర బీజేపీ ప్రభుత్వం కనీసం ప్రశ్నించకపోవడం దారుణమని విమర్శించారు.