ASR: వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని డీఎంహెచ్వో డీ.కృష్ణమూర్తి నాయక్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వ్యాధులు వ్యాపిస్తాయని, దోమల నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమ తెరలు వాడాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. అనారోగ్యానికి గురైతే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని తెలిపారు.