TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలలోపు వచ్చినవారికి నామినేషన్లు దాఖలు చేయడానికి అనుమతి ఇచ్చారు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 వరకు గడువు ఉంది. వచ్చే నెల 11న పోలింగ్, 14న కౌంటింగ్ ఉండనుంది.