RR: గండిపేట మండలం పీరం చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లిన అమ్మమ్మ, మనవరాలు కాలుజారి చెరువులో పడి మృతి చెందారు. మృతులు తాండూరుకు చెందిన యూసుబీ, సబియాగా గుర్తించారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.