TG: కాంగ్రెస్ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ చేసింది శూన్యం అని మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థిని MIM నిర్ణయించిందన్నారు. MIMతో కాంగ్రెస్ కుమ్మక్కైందని ధ్వజమెత్తారు. BRS ఢిల్లీలో లేదు.. గల్లీలో లేదని ఎద్దేవా చేశారు. అధికారం పోయాక కేసీఆర్ బయటకు రాలేదని.. అలాంటి పార్టీ ప్రజలకు అవసరం లేదని అన్నారు.