టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తికి విడాకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితమే వీరిద్దరూ విడిపోయినట్లు సమాచారం. తాజాగా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ సెహ్వాహ్ చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు బలం చేకూర్చుతోంది. తన తల్లితో పాటు ఇద్దరు కొడుకులతో ఉన్న ఫొటోను సెహ్వాగ్ షేర్ చేశాడు. దీంతో విడాకుల వార్త నిజమేనా? అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.