WGL: ఉమ్మడి జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మరొకసారి మంత్రి కొండా సురేఖ చుట్టూ వివాదం చెలరేగింది. మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత, CM, ఉమ్మడి జిల్లా నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం కొండా దంపతులు CM రేవంత్ రెడ్డిని కలవడంతో నేతల మాటలు మూగబోయాయి. వారు CMతో ఏ అంశాలు చర్చించారనే దానిపై జిల్లాలో ఆసక్తి నెలకొంది.