VKB: గ్రామీణ ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తున్నారు. కుల్కచర్ల ముజాహిద్పూర్ మోడల్ స్కూల్ 10వ తరగతి విద్యార్థి అభిరామ్ షూటింగ్ విభాగంలో జాతీయ స్థాయి జట్టుకు ఎంపికైన సందర్భంగా స్కూల్ అధ్యాపక బృందం అబ్బాయిని మంగళవారం సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.