SRCL: ఇల్లంతకుంట మండలంలో, తాళ్లపల్లి ఓం సాయి మహిళాగ్రామైక్య సంఘం సభ్యులు, ఎమ్మెల్యే కవ్వంపల్లి చిత్రపటానికి సోమవారం పాలాభిషేకం చేశారు. తాళ్లపల్లి మహిళా మండలికి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణను ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఇప్పించడంతో, కృతజ్ఞతగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పలువురు పాల్గొన్నారు.