టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ రీఎంట్రీ ఖరారైంది. దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో త్వరలో జరిగే రెడ్ బాల్ సిరీస్‌కి భారత్-ఎ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గా సాయి సుదర్శన్ ఎంపిికయ్యాడు. బెంగళూరు వేదికగా అక్టోబరు 30 నుంచి నవంబరు 2 వరకు తొలి మ్యాచ్ జరగనుండగా.. రెండో మ్యాచ్ నవంబరు 6 నుంచి ప్రారంభం కానుంది.