RR: నార్సింగిలో కారు బీభత్సం సృష్టించింది. అల్కాపురి కాలనీలో బైక్ ను కారు ఢీకొట్టడంతో గాలిలో ఎగిరిపడి తండ్రి, కొడుకులు కింద పడ్డారు. దీంతో చిన్నారిపై నుండి కారు దూసుకెళ్లడంతో చిన్నారి కుషల్ జోయల్ మృతి చెందగా.. తండ్రిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.