KMR: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీస్ అమరవీరుల త్యాగనిరతి వల్లే నేడు శాంతి, భద్రతలు నెలకొన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.