KMM: పేదలకు అనుకూలంగా ప్రభుత్వం పాలన చేస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి కూసుమంచి మండలంలో మంగళవారం పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. నేలపట్ల గ్రామంలో ముదిగొండ రోడ్డు నుంచి కొత్త చెరువు వరకు రూ. 2 కోట్ల 75 లక్షలతో బీటి రోడ్డు శంకుస్థాపన చేసుకున్నామని వివరించారు.