MBNR: ఉదండాపూర్ భూసేకరణ అక్రమాలు బయటపెడతామని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. ఉదండాపూర్ భూసేకరణ అంశానికి సంబంధించి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గైరాన్ భూదాన్ పేరిట కూడా ఎన్నో అక్రమాలు జరిగాయన్నారు. ప్రస్తుతం 23 మంది అక్రమార్కులకు నోటీసులు ఇచ్చామన్నారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రికవరీ చేస్తామన్నారు.