NRML: మామడ మండలం వాస్తవపూర్,రాంపూర్ గ్రామాల్లో మంగళవారం జరిగిన దండారి ఉత్సవాల్లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎఎంసీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి పాల్గొన్నారు. గుస్సాడీ వేషధారణలో ఇంద్రకరణ్ రెడ్డి గిరిజనులను ఉత్సాహపరిచారు. భీమ్ రెడ్డి ఆదివాసులతో కలిసి గుస్సాడీ నృత్యం చేసి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.