TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తం 150కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్రులు, రీజనల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు, ఓయూ, నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. దాఖలైన నామినేషన్లను రేపటి నుంచి ఆర్వో సాయిరాం పరిశీలించనున్నారు.