SRPT: తుంగతుర్తిలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి చిత్రపటానికి మంగళవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డిని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తంగేళ్ళ జితేందర్ రెడ్డి, ఎర్ర హరికృష్ణ, గుజ్జ భాస్కర్, రామలింగారెడ్డి పాల్గొన్నారు.