టీచర్లకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్(NCTE) భారీ షాక్ ఇచ్చింది. ఇకపై టీచర్లందరికీ టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అని ఆదేశాలిచ్చింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే సర్వీసుల్లో ఉన్న వారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని NCTEకి ఉపాధ్యాయ సంఘాలు విన్నవించగా.. తాజాగా దానిని తిరస్కరించింది. దీంతో 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారందరూ రానున్న రెండేళ్లలో టెట్ పాస్ కావాల్సిందే.