NLG: అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. పోలీసుల త్యాగాలు మరవలేనివని అన్నారు. ప్రతి సంవత్సరం శాంతి భద్రతల పరిరక్షణలో అనేక మంది అమరులు అవుతున్నారని తెలిపారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీస్ సిబ్బంది ప్రాణాలను త్యాగం చేసి అమరులయ్యారని, విధి నిర్వాహణలో మన రాష్ట్రంలో ఈ ఏడాది ఐదుగురు అమరవీరులయ్యరని వెల్లడించారు.