PPM: మా ప్రాంతంలో విద్యుత్ ప్రాజెక్టును రాకుండా చూడాలని పనసభద్ర పంచాయతీ ప్రజలు మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి వినతిపత్రంను అందజేశారు. ఆమె మాట్లాడుతూ గిరిజనుల అభిప్రాయం ఎంతో ముఖ్యమైందని త్వరలోనే అందరితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రజల నిర్ణయానుసారంగా చర్యలు తీసుకుంటామన్నారు.