ATP: గుత్తి చెర్లోపల్లి కాలనీలో పాత కక్షల కారణంగా ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో ఓబులేసు, రమేష్ అనే ఇద్దరు వ్యక్తులు వెంకటరమణ అనే వ్యక్తిపై దాడి చేశారు. ఈ దాడిలో వెంకటరమణకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.