PPM: సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అభినందనీయమని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి కొనియాడారు. పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిధిగా పాల్గొని పోలీస్ అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు.