NDL: నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఇవాళ పోలీసు అమరవీరుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాజకుమారి, జడ్జి అమ్మన్నరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.పెరేడ్ కమాండర్ జి.బాబు నేతృత్వంలో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అమరులకు నివాళి అర్పించారు. విధి నిర్వహణలో వారి త్యాగాలు మరువలేవని కొనియాడారు.