AKP: ప్రసవాలన్నీ ప్రభుత్వాసుపత్రుల్లోనే జరగాలని డీఎం అండ్ హెచ్వో డాక్టర్ హైమావతి ఆదేశించారు. మంగళవారం ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు పీ.హెచ్.సీ.ని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. స్టోర్ రూమ్లో స్టాక్ పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలని తెలిపారు.