అన్నమయ్య: మంగళవారం సిద్ధవటం మండలం భాకరాపేట సమీపంలోని ఏపీఎస్పీ 11వ బెటాలియన్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కమాండెంట్ కే. ఆనందరెడ్డి అమరవీరుల స్మారక స్థూపం, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1959లో చైనా సరిహద్దులో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలను స్మరించుకున్నారు.