KRNL: కౌతాళం మండలం ఉరుకుంద శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అభివృద్ధికి రూ. 32 కోట్లు నిధులు వెచ్చించినట్లు ఈవో వాణి తెలిపారు. దేవాలయం ఆవరణలో సైడ్ డ్రైనేజీ కాలువలు, భక్తుల సౌకర్యం నిమిత్తం మరో రెండు అదనపు క్యూలైన్ల ఏర్పాటు, దేవాలయం చుట్టూ రాతి గోడ నిర్మాణం, గోశాల సంరక్షణ, తదితర పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.