KDP: ఉమ్మడి కడప జిల్లాలోని పనిచేస్తున్న 97 మంది సచివాలయ కార్యకర్తలకు గ్రేడ్-5 నుంచి గ్రేడ్-4 పదోన్నతి కల్పిస్తూ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు జిల్లాల్లో 102 మందికి ఉద్యోగోన్నతలకు అవకాశం ఉండగా ఐదుగురు తమకు అవసరం లేదని లేఖ రాసిచ్చారు. దీంతో మిగిలిన వారి పేర్లతో కడప DPO రాజ్యలక్ష్మి సీనియార్టీ జాబితాను రూపొందించారు.