GDWL: దేశ స్వాతంత్య్ర శతాబ్ది (2047) నాటికి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలనే రూపకల్పనకై ఉద్దేశించిన ‘తెలంగాణ రైజింగ్-2047’ సిటిజన్ సర్వేలో ప్రజలందరూ పాల్గొనాలని కలెక్టర్ సంతోష్ నిన్న ఓ ప్రకటనలో కోరారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్న ఈ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొని, తమ అమూల్యమైన సలహాలు, సూచనలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.