KDP: జిల్లా కలెక్టర్ శ్రీధర్ సెలవుపై వెళ్లారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అనుమతులు జారీ చేసింది. ఈనెల 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు ఇచ్చారు. శ్రీధర్ స్థానంలో జెసి అతిథి సింగ్కు అదనపు బాధ్యతలు అప్పగించారు.