MHBD: బయ్యారం మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జగ్గు తండా, వెంకట్రాంపురం గ్రామాల్లో సైడ్ డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం కొత్తపేట, గంధంపల్లి, బాలాజీ పేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ప్రజా ప్రభుత్వంలో జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అన్నారు.