GNTR: అడ్రస్ అడిగే నెపంతో 60 ఏళ్ల దాసరి సుందరమ్మను ఇద్దరు యువకులు మోసం చేసి ఆమె బంగారు గొలుసును అపహరించారు. మధుమేహ పరీక్షల కోసం తెనాలి వచ్చిన వృద్ధురాలిని, ప్రకాశం రోడ్డులో ఆపి, గొలుసు తాత్కాలికంగా ఇస్తే డబ్బులిచ్చి తిరిగి ఇచ్చేస్తామని నమ్మించారు. ఆమె గొలుసు ఇవ్వగానే, ఆ మోసగాళ్లు దానితో పారిపోయారు. బాధితురాలు తెనాలి టూ టౌన్ పోలీసులకు తెలపగా నిన్న కేసు నమోదు చేశారు.