VZM : విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి వనం గుడి వద్ద బుధవారం చండీహోమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ ఈవో కె. శిరీష పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు శాస్త్రోక్తంగా హోమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.