GDWL: అలంపూర్లో వెలసిన జోగులాంబ దేవి, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల హుండీ లెక్కింపు రేపు నిర్వహిస్తున్నట్లు ఈవో దీప్తి ఓ బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఆలయాల ప్రాంగణంలో ఉదయం 10:00 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. స్వామి అమ్మవారి భక్తులు, పరిసర ప్రాంత భక్తులు హాజరై హుండీ లెక్కింపులో పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.