ఇథియోపియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాసింజర్లు, కార్గోలతో వెళ్తున్న రైలు పట్టాలు తప్పడంతో 14 మంది మృతి చెందారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి అధిక లోడే కారణమని ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.