RR: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో మంగళవారం ఉస్మాన్ సాగర్ జలాశయం ఒక గేటు ఎత్తి 117 క్యూసెక్కుల నీటిని, హిమాయత్ సాగర్ రెండు గేట్లు ఎత్తి 1350 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ఉస్మాన్ సాగర్ నీటిమట్టం 1789.90గా ఉంది.