TG: జగిత్యాలలో కూరలో కారం ఎక్కువైందని భర్త మందలించడంతో దసరా రోజు గంగోత్రి అనే యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భార్య మరణంతో తీవ్ర మనస్తాపం చెందిన భర్త సంతోష్(25), 19 రోజుల తర్వాత దీపావళి రోజు ఆదిలాబాద్లో ఉరి వేసుకుని చనిపోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట, నెల రోజులు కూడా గడవకముందే లోకం వీడడంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.